గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా కథలాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యం ఆయింది. కథలాపూర్ మండల కేంద్రంలో మర్రిచెట్టు దగ్గర ఒర్రె కాలువలో మృతి చెందినట్లు ఎస్సై రజిత తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.