లక్ష యాభై వేల ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణం గోవింద్ పల్లికి చెందిన కొలగాని శ్రీనివాస్ ఆటో డ్రైవర్ గా వృత్తిని కొనసాగిస్తూ కాలుకు శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ టిఆర్ఎస్ నాయకులు ఎంబరి వెంకటేష్, మహేష్ లకు తెలిపారు. వారు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి సమస్యను వివరించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చికిత్స కు అవసరమైన లక్ష యాభై వేల రూపాయల ఎల్వోసి ని సోమవారం శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేశారు.
ఎల్వోసి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు శ్రీనివాస్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు మహేష్, పాక్స్ చైర్మెన్ రాజలింగం, గ్రామ శాఖ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ఉప సర్పంచ్ సాగర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్రవెని తిరుపతి, కన్వీనర్ సత్యం, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్, గ్రామ కార్యదర్శి భూమయ్య తదితరులు ఉన్నారు.