కలెక్టరేట్లో దంపతుల ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ కలెక్టరేట్ లో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తుండగా చోటు చేసుకుంది. బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన దర్శనం బంధయ్య, దర్శనం రాణిలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము పాండుతర్పాలో 30 ఏళ్ళ క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటన్నామని, తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టాలు భూమి విక్రయించినవారిపై రావడంతో వారు కబ్జా చేస్తున్నారని అన్నారు.
మాజీ సర్పంచ్ కుటుంబం తమపై దాడులు చేస్తూ, తాము పండించిన పంటను కోసుకుపోతున్నారు అని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. రెవెన్యూ అధికారుల కారణంగా తమ భూమిపై తమకు హక్కు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.