గాలిపటం అమ్మకాల దుకాణాలలో విస్తృత తనిఖీలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగ వేల శనివారం పతంగి మాంజ దారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని గాలిపటం అమ్మకాల దుకాణాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి హాని జరగని విధంగా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.