చదరంగ పోటీలలో విశేష ప్రతిభ
విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి అందులో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపాలని, వసతులు కల్పించాలని తద్వారా వారు అద్భుత విజయాలను నమోదు చేయడమే కాకుండా పోటీతత్వాన్ని అలవర్చుకుంటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ వావిలాలపల్లిలోని ఆల్ఫోర్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో, ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ విద్యార్థి రేటింగ్ చదరంగ పోటీలలో విశేష ప్రతిభ కనబరచినందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మానకృష్ణ దాన్ చేతులమీదుగా సత్కారం అందుకోవడం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వివిధ క్రీడల పోటీలలో పాల్గొని అద్భుతమైన విజయాలను సాధించి సమాజంలో ముందంజలో నిలవాలని వారు కోరారు. ప్రత్యేకంగా తరగతి గదుల్లో భోదిస్తున్న విషయాల ను మరింత ఉత్సాహంగా తెలుసుకోవడానికై మరియు అందులో విజయం సాధించడానికై క్రీడల్లో పాల్గొని విశేష ప్రతిభను కనబరచాలని కోరారు. అందుకు అనుగుణంగా విద్యార్థులకు పాఠశాలలో వివిధ క్రీడలలో నిష్ణాతులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు తగిన ప్రోత్సాహాకాలను అందజేస్తు వారిలో పోటీతత్వాన్ని వెలికి తీస్తూ వివిధ పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలోని ఇంద్రవిజ్ఞాన్ భవన్ వైయెస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహింపబడిన ఆన్ఇండియా రేటింగ్ చదరంగం పోటీలలో పాఠశాలకు చెందినటువంటి టివిశాల్ , 7 వ తరగతి విశేష ప్రతిభను కనబరచడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాన్ చేతులమీదుగా ప్రశంస పత్రముతో పాటు మెమొంటో, నగదు బహమతిని స్వీకరించడం జరిగినదని హర్షం వ్యక్తం చేస్తు విద్యార్థి భవిష్యత్తులో నిర్వహింపబడే పలు పోటీలలో ఘనవిజయాల పరంపరను నమోదు చేయాలని వారు ఆకాంక్షించారు. వివిధ స్థాయిలలో నిర్వహింపబడుతున్న పోటీలలో విద్యార్థికి వెన్నంటిఉండి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరియు వ్యాయమ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
విజేతకు పుష్పగుచ్చంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసి భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.