గడప గడపకు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గడప, గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెల్లాల్సిన భాధ్యత కార్యకర్తలపై ఉందని శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం జగిత్యాలలోని దేవీశ్రీ గార్డెన్లో సోమవారం జరుగగా పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జి ఓదెల జెడ్పిటిసి, టిపిసిసి అధికార ప్రతినిధి గంటా రాములు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇద్దరికి సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న తటస్థులను మన పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా కృషి చెయాలన్నారు. గడప, గడపకు కార్యకర్తలు వెళ్లి కాంగ్రెసు పార్టీ గతంలో ప్రజలకు చెసిన కార్యక్రమాలను వివరించి సభ్యత్వం చేయించాలన్నారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త వారి వారీ పరిధిలో సేవా దృక్పధంతో పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని అప్పుడే వారి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
బూతుల వారీగా పార్టీ సభ్యత్వ నమోదుకు నాయకులకు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యత్వ ఇంచార్జి అవేజ్, నాయకులు కొత్త మొహాన్, గిరి నాగభూషణం, దేవేందర్ రెడ్డి, బండ శంకర్, ఎంపీపీ మసర్థి రమేశ్, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కోండ్ర జగన్, జున్ను రాజేందర్, చిట్ల అంజన్న, అల్లాల రమేశ్ రావు, బండ భాస్కర్ రెడ్డి, గుండా మధు, రఘువిర్ గౌడ్, నాయిని ప్రభాకర్, రవి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.