గృహిణులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్ పర్సన్
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డుల్లో మంగళవారం ఇంటింటా చెత్త సేకరణను మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా గృహిణులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని, మన చుట్టూ పక్కల పరిసరాలను మనమే పరిశుబ్రంగా ఉంచుకోవాలని సూచించారు.