ఇటుక బట్టి యజమానిపై కేసు నమోదు
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఓ ఇటుక బట్టిల యజమాని సత్యనారాయణ బాలికతో ఇటుకలు తయారు చేయిస్తున్నాడు అని సహాయ కార్మికశాఖ అధికారిని చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రామ్ చందర్రావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం కార్మికశాఖ అధికారులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇటుక బట్టీల తయారి కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తించినట్లు చెప్పారు.