Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

Dhanush Divorce : రజనీకాంత్ కూతురికి విడాకులు ఇచ్చిన ధనుష్.. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి..!

0 20

కొత్త ఏడాదిలో బ్యాడ్ న్యూస్ చెప్పి అభిమానులని ఆశ్చర్యానికి గురి చేశారు ధనుష్‌- ఐశ్వర్య దంపతులు. గత ఏడాది సమంత- నాగ చైతన్య అఫీషియల్‌గా విడాకుల విషయాన్ని ప్రకటించి కోలుకోలేని షాక్ ఇవ్వగా, ఇప్పుడు ధనుష్‌- ఐశ్వర్య విడిపోవడంపై అంతటా ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Dhanush Divorce : రజనీకాంత్ కూతురికి విడాకులు ఇచ్చిన ధనుష్.. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి..!

నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ సినిమా ‘3’ని తెరకెక్కించారు.18 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్న ఈ జంట సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరు షాక్ అవుతున్నారు.

18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం .మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.ఇక ఐశ్వర్య కూడా తన సోషల్ మీడియలో ఇదే పోస్ట్ పెట్టింది.స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం.

ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి… ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో ఐశ్వర్య పేర్కొంది. కొన్నాళ్ల క్రితం రజనీకాంత్ మరో కూతురు సౌందర్య కూడా విడాకులు తీసుకొని పారిశ్రామిక వేత్త విషాగన్ వనంగముడి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents