వరంగల్ బయలుదేరిన మంత్రుల బృందం
గత వారం, పది రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈదరుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురవడంతో చేతికి వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. తోటలు ధ్వంసమయ్యాయి. రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కాగా వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నేడు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పరిశీలించనుండగా.. ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. కాగా ఆ పంటలను పరిశీలించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సారధ్యంలోని బృందం బేగంపేట విమానాశ్రయం నుండి వరంగల్ , హన్మకొండ జిల్లాకు బయలుదేరింది. ఈ బృందంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.