ఆ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు!
ఒక చేప ఖరీదు రూ.2 నుంచి 3 కోట్లు అని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా అని పిలిచే చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచింది. ఒక నివేదిక ప్రకారం.. చైనా ప్రజలు దీని కోసం అడిగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. ఈ చేపల వ్యవహారంతో జనం జైలుకి కూడా వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. చైనాలో ప్రజలు ఈ చేపను స్థితి చిహ్నంగా భావిస్తారు.
ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది తమ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు. 19వ, 20వ శతాబ్దాలలో డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్ ఫిష్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. అదే సమయంలో అమెరికాలో మీరు ఈ చేపను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇక్కడ అక్రమంగా డ్రాగన్ ఫిష్ విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదు. అందుకే ఈ చేప పట్ల ప్రజల్లో ఎప్పుడు ఆసక్తి నెలకొని ఉంటుంది. ఒక చేప ఖరీదు రూ.2 నుంచి 3 కోట్లు అని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా అని పిలిచే చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచింది. ఒక నివేదిక ప్రకారం.. చైనా ప్రజలు దీని కోసం అడిగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ చేపను కొనుగోలు చేయడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. ఈ చేపల వ్యవహారంతో జనం జైలుకి కూడా వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. చైనాలో ప్రజలు ఈ చేపను స్థితి చిహ్నంగా భావిస్తారు.
ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది తమ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు. 19వ, 20వ శతాబ్దాలలో డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్ ఫిష్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. అదే సమయంలో అమెరికాలో మీరు ఈ చేపను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అందుకే ఇక్కడ అక్రమంగా డ్రాగన్ ఫిష్ విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదు. అందుకే ఈ చేప పట్ల ప్రజల్లో ఎప్పుడు ఆసక్తి నెలకొని ఉంటుంది.