హైవే విస్తరణకు నిధుల మంజూరు: బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ. 578. 85 కోట్ల నిధులు మంజూరు చేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.