Print Friendly, PDF & Email

పెళ్లి పేరుతో మూడుసార్లు అబార్షన్, పోలీసుల ముందు ఓకే, బయట రివర్స్, ప్రియురాలు !

0 25

 పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్న యువతి తన భర్తతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని ఎన్నోకలకలు కనింది. పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు కూడా కాకముందే ఆ యువతి భర్త అనారోగ్యంతో చనిపోయాడు.

Cheating: పెళ్లి పేరుతో మూడుసార్లు అబార్షన్, పోలీసుల ముందు ఓకే, బయట రివర్స్, ప్రియురాలు !

భర్త చనిపోవడంతో ఆ యువతి ఓ చోట ఉద్యోగంలో చేరింది. ఇదే సమయంలో పరిచయం అయిన యువకుడు ఐ లవ్ యూ అంటూ ఆమె వెంట తిరిగాడు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసని, నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు భర్త చనిపోయిన మహిళను మూడుసార్లు గర్బవతిని చేసి మూడుసార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె దగ్గర లక్షల్లో డబ్బులు, బంగారు నగలు ఇప్పించుకున్న యువకుడు చివరికి నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ చేతులు దులుపుకున్నాడు. ప్రియుడు మోసం చెయ్యడంతో రగిలిపోయిన ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఐదు సంవత్సరాలకే భర్త చనిపోయాడు

 తమిళనాడులోని నెలై జిల్లాలోని తిస్సయన్ విలై ప్రాంతంలో శశికళ అనే యువతి నివాసం ఉంటున్నది. పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్న శశికళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. తన భర్తతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని శశికళ ఎన్నోకలకలు కనింది. పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు కూడా కాకముందే శశికళ భర్త అనారోగ్యంతో చనిపోయాడు.

పుట్టింటిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న యువతి

భర్త చనిపోవడంతో శశికళ తిస్సయన్ విలై ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటి దగ్గర ఓ షాపులో శశికళ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న శశికళను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ముత్తు అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. కొంతకాలం నువ్వు నాకు స్నేహితురాలు అంటూ ముత్తు శశికళ వెంట తిరిగాడు.

మూడుసార్లు అబార్షన్ చేయించిన ప్రియుడు

ఇదే సమయంలో పరిచయం అయిన శశికళ వెంట కొంతకాలం తిరిగిన ముత్తు ఐ లవ్ యూ అంటూ ఆమె వెంటపడ్డాడు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసని, నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని ముత్తు అతని స్నేహఇతురాలు శశికళకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ముత్తు ఆమెను లొంగదీసుకుని శారీరక సంబంధం పెట్టుకునిన మూడుసార్లు గర్బవతిని చేసి మూడుసార్లు అబార్షన్ చేయించాడు.

నగలు, రూ. లక్ష డబ్బులు తీసుకుని ?

వివాహం చేసుకుంటానని శశికళను నమ్మించిన ముత్తు ఆమె దగ్గర ఇప్పటి వరకు రూ. 1 లక్షకు పైగా డబ్బులు, బంగారు నగలు తీసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నది. డబ్బులు, నగలు తీసుకున్న తరువాత ముత్తు నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగాడు. ప్రియుడు ముత్తుకు నచ్చచెప్పి సహనం కోల్పోయిన శశికళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల ముందు ఓకే చెప్పాడు….. చివరికి చేతులు ఎత్తేశాడు

పోలీసులు శశికళ, ముత్తును పిలిపించి విచారణ చేశారు. కేసు నమోదు అయితే జైలుకు పోతామనే భయంతో ముత్తు ఆ సమయంలో తాను శశికళను పెళ్లి చేసుకుంటానని పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ముత్తు అతని ప్రియురాలు శశికళు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. పెళ్లి చేసుకోమని అడిగిన శశికళకు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ ముత్తు చేతులు దులుపుకున్నాడు. ప్రియుడు ముత్తు మోసం చెయ్యడంతో రగిలిపోయిన ప్రియురాలు శశికళ అతని ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents