నిషేధిత గుట్కా పట్టివేత
గుట్కా సరఫరా చేస్తున్న వ్యక్తులను కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది నెలలుగా కరీంనగర్ పట్టణ చుట్టూ పక్కల మండలాల్లో గుట్కా సరఫరా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా లక్షల విలువ చేసే వాహనాన్ని పట్టుకున్నారు. ఇల్లంతకుంట మండలం ఊరు చివరలో వాహనాలు తనిఖీ చేపట్టగా నిషేధిత గుట్కా తో వెళ్తున్న వాహనము ఆపి తనిఖీ చేయగా పెద్దమొత్తంలో నిషేధిత గుట్కా బయటపడ్డదని పోలీసులు తెలిపారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన భోగం రాజేందర్, శేఖర్ గుట్కా వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 3 లక్షల 25 వేల విలువ గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గుట్కా వ్యాపారం నిర్వహించే వారిపై నిఘా ఉంచడం జరిగిందని, గుట్కా వ్యాపారం నిర్వహిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు.