వందలాది పక్షుల ఆత్మహత్య. భయపెడుతున్న దృశ్యాలు.
మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. అసలు పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తాం. కానీ, మెక్సికోలో వందలాది పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాయి. పక్షులన్నీ గుంపుగా కిందపడిపోవడంతో అందులో చాలా పక్షులు రోడ్డుపై పడి మరణించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఫిబ్రవరి 7 వ తేదీన జరిగింది. ఈ దృశ్యాలను చూసి పక్షిశాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విషవాయువుల కారణంగానే వందలాది పక్షులు కిందపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
Hundreds of birds mysteriously plummet to their deaths in Chihuahua, Mexico. pic.twitter.com/j0JyP6ZcnM
— Ian Miles Cheong (@stillgray) February 12, 2022