పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నరహరి ఐఏఎస్ జన్మదిన వేడుకలు
పద్మశాలి ముద్దు బిడ్డ మధ్యప్రదేశ్ కమీషనర్ & సెక్రటరీ శ్రీ నరహరి ఐఏఎస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని లోని మార్కండేయ దేవస్థానంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం, పట్టణ పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం మాట్లాడుతూ నరహరి గారు ఉన్నత పదవిలో ఉండి కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయనలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో ఉన్నత పథకాలు చేపట్టారని, అనునిత్యం ప్రజల మంచికోరుకునే వ్యక్తి నరహరి గారు అని అన్నారు. అయన జీవితమూ మరిన్ని ఉన్నత పదువులు అనుభవించాలని, మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. పద్మశాలి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. నరహరి గారు ఉన్నత పదవిలో ఉండి కూడా ఏంటో ఉన్నత మనసుతో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయన జీవితం యువతకు మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షలు మెతుకు సత్యం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గుడిమళ్ల శ్రీకాంత్, వాసాల అఖిల్, అల్స భద్రయ్య, మరియు కుల భాందవులు పాల్గొన్నారు.