కార్మికుల పదవీ విరమణ వయసు పెంచాలి
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుల పదవీ విరమణ వయో పరిమితి 58 నుంచి 61 ఏళ్లకు పెంచాలని యూనియన్ ప్రెసిడెంట్ బయ్యపు మనోహర్ రెడ్డి గురువారం ఎమ్మెల్యే చందర్ కు వినతి పత్రం అందశారు. కార్మికుల వయో పరిమితిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి జీవో జారీ చేసేలా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాడి మహేష్, కేశోరాం కార్మికులు పాల్గొన్నారు.