ప్రేమ పేరుతో బురిడీ కొట్టి. లక్షలు కొల్లగొట్టి.

నమ్మిన స్నేహితులను అడ్డంగా మోసగించి లక్షల రూపాయలు దండుకున్న అంతరాష్ట్ర చీటర్ ను అదుపులోకి తీసుకున్నామని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ సుల్తానాబాద్ కు చెందిన ఒక్క మహిళ ను మోసగించి 15. 50 లక్షల రూపాయల నగదుతోపాటు అయిదున్నర తులాల బంగారాన్ని తీసుకున్నాడని ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మహిళ వివాహ సంబంధం కోసం తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టుకుందని, ప్రొఫైల్ చూసిన రాహుల్ మహిళ ను వివాహం చేసుకుంటానని నమ్మించి చాటింగ్ మొదలు పెట్టాడన్నారు. తరచూ ఆ మహిళ దగ్గర నగదు తీసుకున్న తిరిగి ఇచ్చేవాడిని కొంతకాలం అనంతరం మహిళ దగ్గర్నుండి వివిధ కారణాలు చెప్పి విదేశాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పి 6 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడన్నారు. అనంతరం మహిళకు కూడా అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏడున్నర లక్షల రూపాయల నగదు తీసుకున్నాడన్నారు. ఇటీవల మరికొంత నగదు కావాలని చెప్పడంతో మహిళను నమ్మి అయిదున్నర తులాల బంగారాన్ని ఇవ్వగా మణిపురం ఫైనాన్స్ లో బంగారం కుదవ పెట్టి 1. 30 లక్షల నగదు తీసుకున్నాడన్నారు. రాహుల్ మోసగించాడని తెలుసుకున్న సదరు మహిళ సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సుల్తానాబాద్ పోలీసులు, ఏసీపీ ఆదేశాలతో ప్రత్యేకంగా 3 టీమ్స్ ఏర్పాటు చేసి రాహుల్ కోసం హైదరాబాద్, ఖమ్మం, విజయవాడలలో దర్యాప్తు ప్రారంభించగా రాహుల్ మోసాలు బయట పడ్డాయన్నాయి.

2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ లోని ఎల్బి నగర్ లో, 2013లో విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవలి కాలంలో స్నేహితుల సహాయంతో ఈఎ౦ఐలలో స్నేహితుల పేరిట రుణాలు తీసుకొని నాలుగైదు నెలలపాటు ఈఎ౦ఐలు కట్టి అనంతరం మిగిలిన కిస్థిలు కట్టకపోవడంతో స్నేహితులు కోట్లాది రూపాయలు కట్టాల్సి వచ్చిందన్నారు. రాహుల్ బాధితుల గురించి తీసుకొనగా మంగళగిరి కి చెందిన జాస్తి వెంకటేశ్వర్లును 50 లక్షల రూపాయలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి 1. 80 లక్షలు, షేక్ కలీల్ ను 4. 86 లక్షలు, నాయుడు వెంకటేష్ ను 1. 20 లక్షలు, హైదరాబాదుకు చెందిన ప్రసన్న లక్ష్మిని 25 లక్షలు, ప్రకాశం కు చెందిన కరీముల్లా ను 1. 45 లక్షలు, బాచు అప్పన్నను 2. 5 లక్షలు, ముప్పి రాజు మణికంఠ నుండి రెండు లక్షల రూపాయలు మోసగించడన్నారు. రాహుల్ ను అదుపులోకి తీసుకోవడంతోపాటు అతని వద్ద నుండి లక్ష రూపాయల నగదు, చెక్కులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కావద్దని జాగ్రత్తగా ఉండాలని కోరారు. నమ్మించి మోసగించిన రాహుల్ ను అదుపులోకి తీసుకొని అతడు చేసిన నేరాలను బహిర్గతం చేసిన సుల్తానాబాద్ సి ఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ ఉపేందర్ లతోపాటు సిబ్బందిని అభినందించడంతోపాటు నగదు రివార్డులు అందజేశారు. ప్రజలు ఈలాంటి మోసగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, మహిళలు మరి జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents