ఫిల్టర్ బెడ్ లో నీటి శుద్ధీకరణను పరిశీలించిన మేయర్
కరీంనగర్ పట్టణంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని సిటీ మేయర్ వై సునీల్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ లో రా వాటర్ ను నిబంధన మేరకు శుద్ధిచేసి పంపించాలన్నారు. పంపింగ్ కు సంబంధించిన మోటార్లను సక్రమంగా చూసుకోవాలని అన్నారు. చఅవసరమైన వాటికి మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫిల్టర్ చేసిన నీటిని పరీక్ష చేసిన తర్వాత రిజర్వాయర్ లకు పంపింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారి వేణు, ఫిల్టర్ బెడ్ సిబ్బంది అజయ్, తదితరులు పాల్గొన్నారు.