రాష్ట్ర భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంది: కోప్పుల
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని యువత క్రీడలు అడటం జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని జవహర్‌లాల్ స్టేడియంలో కోరుకంటి ప్రీమియర్ లీగ్ కేటిఆర్ గోల్డ్కప్ క్రికేట్ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిధిలుగా పాల్గోన్నారు. క్రికేట్ పోటీల విజేతలకు నగదుతో పాటు బహుమతులు అందించారు. యువకులు క్రీడలపై అసక్తి పెంచుకోవాలని, క్రమశిక్షణ పట్టుదల సాధన చేస్తే ఎదైనా సాధించవచ్చాన్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4వ డివిజన్, 6వ డివిజన్ టీంలు తలపడగా 6వ డివిజన్ విజయం సాధించింది. 6వ డివిజన్ టీం మెదటి బహుమతిగా 50వేల రూపాయలు, 4వ డివిజన్ టీం రెండవ బహుమతిగా 25 వేల రూపాయలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగీ అనిల్కుమార్ , డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు , కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు