Print Friendly, PDF & Email

మన ఊరు మన బడి సమీక్ష సమావేశం

0 155

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పారిశుద్ధ్యం, ఆస్తి పన్నుల వసూళ్లు, మన ఊరు మన బడి కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 230 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద కావాల్సిన సౌకర్యాలను గుర్తించి నివేదికలు అందజేయాలని అన్నారు. ఎంఈఓలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు సమన్వయంతో పాఠశాలను సందర్శించి కావలసిన సౌకర్యాలను గుర్తించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల పేరిట అకౌంట్లు, సిఎస్ఆర్ అకౌంట్లు తెరవాలని సూచించారు.
మన ఊరు మన బడి సమీక్ష సమావేశం
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలు అన్నిటికీ పెయింటింగ్ చేయించాలని, అవసరమైన చోట మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ పూర్తి కాకుండా నిలిచిపోయిన వైకుంఠ దామాలను ఈ నెల ఆఖరు వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పనులు పూర్తి చేసేందుకు ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో నర్సరీలను 100 శాతం పూర్తిచేయాలని అన్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, మొక్కలను కాపాడేందుకు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆస్తి పనులను 100 శాతం వసూలు చేయాలని తెలిపారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents