బాయ్ ఎన్నికల బరిలో గోపీచంద్!
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఎన్నికల బరిలో నిలువనున్నాడు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
నామినేషన్లు వేసేందుకు శుక్రవారం చివరి తేదీగా నిర్ణయించారు. ఇక గోపీచంద్ కార్యదర్శి పదవి కోసం పోటీ చేయనున్నాడు. ఇక ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి బ్యాడ్మింటన్ చీఫ్‌గా ఎంపికవ్వడం లాంఛనంగా కనిపిస్తోంది. ఇక గోపీచంద్ కూడా ఏకగ్రీవం ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.