సింధు ఇంటికి..
జర్మనీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. అయితే పురుషుల విభాగంలో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ముందంజ వేశాడు.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో వెనుకబడిన ఉన్న చైనా షట్లర్ జాంగ్ యి మాన్ చేతిలో సింధు కంగుతిన్నది. మూడు సెట్ల హోరాహోరీ పోరులో జాంగ్ 2114, 1521, 2114 తేడాతో సింధును చిత్తు చేసింది. ఇక శ్రీకాంత్ 2116, 2123, 2118 తేడాతో చైనా షట్లర్ లు జాంగ్ జుపై విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ ముందంజ వేశాడు.