బీరు బాబులకు శుభవార్త.. మరోసారి తగ్గనున్న ధరలు.. ఎంతంటే…
అసలే ఎండాకాలం షురు అయింది. దీంతో చల్లగా ఓ బీరు తాగుదామంటే వాటి ధరలు మండుతున్నాయి. దీంతో బీర్లను ఇష్టపడే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ బీర్లు 150 నుండి 200 మధ్య ఉండడంతో వినియోగదారుల జేబులు ఖాలీ అవుతున్నాయి. దీనికి తోడు నేపథ్యంలోనే రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది.
అయితే ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచడంతో వాటి సేల్ పడిపోయింది. ముఖ్యంగా ఎండకాలం వస్తుండడంతో పాటు గత రెండు సంవత్సరాలుగా కరోనా భయంతో బీర్ల సేల్ పడిపోయింది. దీంతో వాటి ధరలను తగ్గించి వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒక్కో బాటిల్‌పై పది రూపాయలు తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో 20 రూపాయలు తగ్గించాలని నిర్ణయించింది. ధరలను తగ్గిస్తే పెరిగిన గత సంవత్సరం స్టాక్ క్లియర్ అవుతుందని, వేసవి ప్రారంభమైనందున మద్యం అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక తగ్గనున్న బీర్ల ధరలను ఏప్రీల్ మొదటి వారంలోనే షురు కానున్నట్టు తెలుస్తోంది.