పుతిన్‌కు మెదడు సంబంధిత రుగ్మత!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మెదడు సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నారని.. డెమెన్షియా, పార్కిన్‌సన్ వ్యాధి లేదా క్యాన్సర్ కోసం తీసుకొన్న స్టెరాయిడ్ చికిత్స వలన వచ్చిన ‘రొయిడ్ రేజ్’ ఫలితమే ఇది అని నిఘా వర్గాలు వెల్లడించినట్టు యూకేకి చెందిన డెయిలీ మెయిల్ తాజాగా నివేదించింది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయంపై చర్చ నడుస్తున్నది. పుతిన్ నిర్ణయం వెనుక సైకలాజికల్ కారణం ఉన్నదని భావిస్తున్నట్టు క్రెమ్లిన్ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకేలతో కూడిన ‘ది ఫైవ్ ఐస్’ అనే నిఘా కూటమి సభ్యులు పేర్కొన్నారు. పుతిన్‌లో అస్థిర ప్రవర్తన పెరిగిందని, వచ్చిన అతిథులతో క్రెమ్లిన్‌లో దూరంగా ఉంటూ సమావేశమవడం వంటి సందర్భాలను ఫుటేజీల్లో చూశామని అన్నారు.