అల్ఫోర్స్ విద్యార్థులకు అత్యధిక బంగారు పతకాలు
6వ అంతర్రాష్ట్ర కరాటే పోటీలలో అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెనెక్ట్స్ విద్యార్థులకు అత్యధిక బంగారు పతకాలు గెలుచుకున్నారు. ప్రతి విద్యార్థికి క్రీడలు చాలా ఉపకరిస్తాయని, వాటి ద్వారా విజయాలను సునాయసంగా సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెనెక్స్ట్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసినటువంటి విజేతల అభినందనసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విధిగా పాఠశాల స్థాయి నుండే వివిధ క్రీడల్లోని విషయాలను తెలిపి , శిక్షణ ఇప్పించాలని కోరారు తద్వారా వారు ఘనవిజయాలను అత్యధికంగా సాధించగలుతారని చెప్పారు. క్రీడారంగం వలన లాభాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పాఠశాలలో చాలా అనుభవం మరియు పైపుణ్యం కల్గిన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలుపుతూ పాఠశాల స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన విద్యార్థులకు చేయూతనిచ్చి వివిధ స్థాయిలలో నిర్వహింపబడే పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో కరీంనగర్ లోని డా॥బి. ఆర్ అండేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహింపబడినటువంటి 6వ అతరాష్ట్ర కరాటే పోటీలలో పాఠశాలకు చెందినటువంటి కె. పావని , 9వ తరగతి , అండర్ 15వ విభాగంలో కరాటేలోని కటాలో బంగారు పతకం , కుమిటేలో బంగారు పతకం మరియు చాంపియన్షిప్ , కె. అనుజ , 6వ తరగతి అండర్ 12వ విభాగంలో కటాలో బంగారు పతకం , కుమిటేలో కాంస్య పతకం మరియు ఎ. మాన్విత్ , 7వ తరగతి , అండర్ 11వ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో అత్యధిక పతకాలను అందించినందుకు వారు విజేతలకు పుష్పగుచ్చాలతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు.
భవిష్యత్లో మరిన్ని ప్రశంసనీయమైన, సంచలన విజయాలను నమోదు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డా. వి. నరేందర్ రెడ్డి ఛైర్మెన్, పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.