Print Friendly, PDF & Email

దేశవ్యాప్తంగా మార్మోగుతున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’

0 16,300

వివాదాలకు, సంచలనాలకు కేంద్రబిందువుగా ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 1990లలో కాశ్మీరీ పండిట్ల వలసలు, వారిపై సామూహిక్య హత్యాకాండల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.42.20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటన చేసింది. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్, త్రిపుర, గోవా, హర్యానా రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటూ మంగళవారం ట్వీట్ చేశారు. హీరోయిన్ ప్రణీత కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

The Kashmir Files Movie Review: An impactful watch with so much sense

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents