13500 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్
ఇప్పటి వరకు 13500 రష్యా సైనికులను హతమర్చామని, 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. 404 యుద్ధ ట్యాంకులను, 1279 ఆర్మీ వాహనాలను రష్యా నష్టపోయింది. 640 వాహనాలను నష్టపోయింది. 36 యాంటీ ఏయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, మరికొన్ని నాటో దేశాలు ఉక్రెయిన్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. నిధులను, యుద్ధ సామాగ్రిని సమకూరుస్తున్నాయి. దీంతో రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ తీవ్రంగా ఎదుర్కొంటోంది.