రూ.1కే ఆర్ఆర్ఆర్ టికెట్ అంటూ పేటీఎం ఆఫర్
ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా దీనిని రూపొందించారు. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి పాత్రలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. వారి సరసన ఒలీవియా మోరిస్, అలియా భట్ ఆడిపాడనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, లైకా, పెన్ స్టూడియో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిమానులకు పే టీఎం సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా బుధవారం ప్రకటన చేసింది. ఇందుకు ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌కి రూ.1 పంపించాల్సి ఉంటుంది. తద్వారా రూ.150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్‌ను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రేక్షకులు పంపిన రూ.1ని కూడా తిరిగి వారి ఖాతాలో రీఫండ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే ఉంటుందని పేటీఎం వెల్లడించింది.