సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం
తంగళ్లపల్లి మండలం లక్ష్మిపూర్ పొచమ్మ అలయ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రవీణ్, శ్రీకాంత్, సంతోష్, రాజశేఖర్ లు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ విద్యార్థులు వారలక్ష్మి, అపర్ణ, అభినయ, అనూషలను హుటాహుటిన శనివారం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.