పారదర్శకంగా లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక: అదనపు కలెక్టర్
పారదర్శకంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశం కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022- 23 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట నందు 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ ద్వారా ఇద్దరు విద్యార్థులను దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేశామని వివరించారు. ధర్మారం మండలం మల్లాపూర్ కు చెందిన గుమ్మడి అలంకృత, మంథని మండలం సిరిపురం గ్రామానికి చెందిన సెగ్గం అభినవ్ ను లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి, మండల విద్యాధికారి సురేందర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నాగేశ్వర్ పాల్గొన్నారు.