యువతి యువకులకు పోలీస్ వారి ఆద్వర్యంలో ఉచిత శిక్షణ
రాజన్న సిరిసిల్ల యువతీ, యువకులు ఎస్. ఐ, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాల ఉచిత శిక్షణ గురించి జిల్లా పోలీస్ వారి ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గురువారం వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు. అందుకుగాను తేదీ 27-03-2022లోపు అర్హులైన యువతి, యువకులు పూర్తి వివరాలు దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకోవాలని అని ఉచిత శిక్షణ కొరకు పేర్లు నమోదు చేసుకున్న వారందరికి ఏప్రిల్ మొదటి వారంలో స్క్రీనింగ్ (టెస్ట్ అర్హత పరీక్ష) ఉంటుందని, ఇందులో హర్హత సాధించిన వారికి నిపుణులచేత ఉచిత శిక్షణ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో అందివ్వడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సైతం తెలిపారు.