రివ్యూ : అంచనాలను తలకిందులు చేసిన “RRR” చిత్రం.!

0 174,568

ఫైనల్ గా ఆ బిగ్ డే రానే వచ్చింది.. కళ్ళు చెదిరే సంబరాలు, పటాసుల ప్రకంపనలు థియేటర్స్ వద్ద ఇద్దరు హీరోల కేరింతలు తో ఇండియన్ సినిమా దద్దరిల్లే రోజు రానే వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ అయ్యింది.

Twitter Review On RRR Movie :  ట్విట్టర్ రివ్యూ : వారి అంచనాలను తలకిందులు చేసిన "RRR" చిత్రం.!

ఎన్నెన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సెన్సేషనల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సంచలనం రేపింది. మరి యూఎస్ లో నిన్న రాత్రి 11 గంటల నుంచి అలాగే మన దేశంలో రాత్రి 9 గంటల నుంచి బాలీవుడ్ లో స్పెషల్ షో తో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా హంగామాపై ట్విట్టర్ లో సినీ ప్రముఖులు మరియు మూవీ లవర్స్ రివ్యూ లు బయటకి వచ్చేసాయి.

అయితే ఇందులో పెద్దగా విడదీయడానికి ఏమీ లేకుండా ఒకటే టాక్ వినిపిస్తుంది. రాజమౌళి అన్ని సినిమాలకి ఏదైతే టాక్ వస్తుందో ఈ సినిమాకి కూడా అదే రీపీట్ అయ్యింది. ఇద్దరు హీరోలతో కలిపి తాను ఏదైతే చేయగలడో అదే చేసి టెర్రిఫిక్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చారని ఒకటే టాక్ వైరల్ ఆవుతుంది.

హీరోల ఎంట్రీలు నుంచి ఎమోషన్స్ వరకు రాజమౌళి ఓ రేంజ్ ఫీస్ట్ ఇచ్చారని అంటున్నారు. పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఈ సినిమా న్యాయం చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా హిందీలో వేసిన స్పెషల్ షో చూసాక రాజమౌళి అండ్ టీం కి స్టాండింగ్ ఓవియేషన్ ని అక్కడి విమర్శకులు ఇచ్చారని తెలిసింది.

దీని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి అయితే చిత్రం పై పనిగట్టుకొని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యాలి అనుకున్నవారి అంచనాలను కూడా ఈ సినిమా తలకిందులు చేసి ఒక భారీ శుభారంభం ఈ చిత్రం అందించింది అని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర సంచలనం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents