మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ గురించి అలా అన్నాడేంటి.?

0 42,521

భారతీయ చలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమా స్థాయి ఏంటో రాజమౌళి మరొకసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చరణ్ అభిమానులే కాకుండా సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా ఇది. సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీల ప్రీమియర్ షో కూడా చూశారు.హైదరాబాద్ లోని ‘ఏఎంబీ మాల్’లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్ షో వేశారు. ఈ షోకి స్టార్ హీరోలతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వీక్షించారు.

Mahesh babu: మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ గురించి అలా అన్నాడేంటి.?

మహేష్ – ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ఒక సినిమాని ఇంత అద్భుతంగా పొగడలేదు.మహేష్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనమందరం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశాం. మన ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.

హీరోలతో పాటు అజయ్ సర్, అలియా కూడా హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారని మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా టీమ్ కూడా అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా సముథ్రకని గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి అందించిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents