RRR సినిమాకి మైనస్ అదే..ఆ ఒక్కటి సెట్ చేసుంటే కేకోకేక..అంతే..!!
ఎట్టకేలకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన RRR సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలవ్వటంతో..ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక మెగా నందమూరి ఫ్యాన్స్ అంటూ తేడా లేకుండా ఇద్దరు అభిమానులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టడనికి ట్రై చేస్తున్నారు. సినిమాలోని ప్రతి సీన్ లో జక్కన్న తన మార్క్ చూయించాడు.

ఇక సినిమా స్టార్టింగ్ మొదలు..ఎండింగ్ వరకు ప్రతి సీన్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ విషయంలో జక్కన్న తన మార్క్ చూయించాడు..మగధీర..బాహుబలి సినిమాలను మించిపోయేలా ఈ సినిమాలో చాలా కొత్త విషయాలను చూపించాడు. . ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ అదిరిపోయినట్లు ఫ్యాన్స్ ట్విటర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్స్ చూసిన మెజారిటీ వర్గాలు చెబుతున్న మాట మూవీ అద్భుతం. రాజమౌళి మరోసారి ప్రేక్షకులను మాయ చేశాడు. ఆద్యంతం అలరించే ఎమోషన్స్, యాక్షన్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు. కానీ ఇంటర్వెల్ తరువాత వచ్చే అరగంట సినిమా కాసేపు సినిమా ని స్లో చేసిందని..కానీ దాని కూడా రాజమౌళి షాకింగ్ ట్వీస్ట్ లతో..కవర్ చేశాడని..ప్రతి సీన్ ని ఓ శిల్పిలా చెక్కాడాని అంటున్నారు. ఆ అరగంట సేపు సినిమా స్లో తప్పిస్తే..ఇక ఏ విషయంలోను RRR లో ఎత్తిచూపే పని లేదు..ఓవర్ ఆల్ గా ఓ విజువల్ వండర్ అంటూ రాజమౌళిని పొగిడేస్తున్నారు.