Print Friendly, PDF & Email

బండి సంజయ్ కు కృతజ్ఞతలు

0 14,919

సైనిక్ స్కూల్ మంజూరు కు కృషిచేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కి బిజెపి జిల్లా శాఖ సన్మానం 

 కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్… బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి…

 

దేశ వ్యాప్తంగా ప్రకటించిన 21 బడుల్లో తెలంగాణ నుంచి రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సైనిక్ స్కూల్ మంజూరు కి కృషిచేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను ఆదివారం బిజెపి జిల్లా అధ్యక్షులు   గంగాడి కృష్ణారెడ్డి అధ్వర్యంలో  బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూకరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఇకమీదట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో మరింత నాణ్యమైన విద్యను అందించేలా రూపుదిద్దుకోనుందన్నారు.

2020 -21 బడ్జెట్ లో దేశవ్యాప్తంగా వంద సైనిక్ స్కూల్లో ను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అరుదైన అవకాశం రుక్మాపూర్ కు దగ్గడం హర్షించదగ్గ విషయం అన్నారు.కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏకైక సైనిక్ స్కూల్ కోసం ఎంపీ బండి సంజయ్ కుమార్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. సైనిక్ స్కూల్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు, ఏర్పాటుకు కృషిచేసిన బండి సంజయ్ కుమార్ లకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి,కటకం లోకేష్, బండ రమణారెడ్డి, పుప్పాల రఘు, పొన్నాల రాము,కెంచ శేఖర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents