హైవే పెట్రోలింగ్ తో ప్రమాదాల నియంత్రణ
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు 24 గంటలపాటు హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ప్రదీప్ కుమార్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఎంతోమంది మృతి చెందడంతోపాటు క్షతగాత్రులవుతున్నారాన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసమే ఇటీవల పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని 35 కిలోమీటర్ల రాజీవ్ రహదారిపై 24 గంటల పాటు హైవే పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. హైవే పెట్రోలింగ్ వల్ల గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, వివిధ కారణాలతో రహదారులపై నిలిచిన వాహనాలను తొలగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో హైవే పెట్రోలింగ్ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎస్సై రాజేష్ పాల్గొన్నారు.