131 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ : మంత్రి గంగుల

0 1,799

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్నారు..

అనారోగ్యం బారినపడి మెరుగైన చికిత్స చేయించుకుని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నవారికి మంజూరైన చెక్కులను మంత్రి గంగుల కమలకర్ పంపిణీ చేశారు.

కరీంనగర్ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద మంజూ రైన 50 లక్షల 41 వేల 500 విలువ గల131 చెక్కులను మంత్రి మీసేవా కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ స్థానికంగా బాధితులకు అందించారు…

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు.తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ము17852ఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు… సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు…

రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామనిమంత్రి భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు నాయకులు చల్ల హరిశంకర్ ,నాంపెల్లి శ్రీనివాస్ ,శ్యామ్ సుందర్ రెడ్డి సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents