కన్నతల్లే కొడుక్కి కంట్లో కారం పెట్టింది.. (Video)
మత్తు పదార్ధాలకు, మాదకద్రవ్యాలు అలవాటు చేసుకున్న వాళ్లు ఎంతో మంది వాటికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పట్టుమని 15సంవత్సరాలు కూడా లేని తన బిడ్డ మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఇంటికి కూడా రావడం లేదని ఓ తల్లి తీవ్రమనోవేదనకు గురైంది. కూర్చొబెట్టుకొని చెప్పేంత చిన్నపిల్లవాడు కాదు. అలాగని కొట్టి పోలీసులకు అప్పగించేంత నేరస్తుడు కాదు. ఎలాగైనా మత్తు పదార్ధాలకు అలవాటుపడిన తన బిడ్డను మార్చుకోవాలని ఓ కన్నతల్లి కొంచెం కఠినంగా వ్యవహరించింది. సూర్యాపేట(Suryapeta)జిల్లా కోదాడ (Kodada)లోని గాంధీనగర్(Gandhinagar)కి చెందిన 15సంవత్సరాల అబ్బాయి() గంజాయికి అలవాటు పడ్డాడు. ఎన్నోసార్లు తల్లి అతడికి మంచి అలవాటు కాదని చెప్పింది. గంజాయి తాగవద్దని పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికి తీరు మార్చుకోకుండా గంజాయి (Cannabis)సేవించడానికి వెళ్లి(15Years boy)ఇంటికి కూడా రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. గంజాయి మత్తులో జోగుతున్న తన బిడ్డను ఇంటి దగ్గరున్న కరెంట్ స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లింది కన్నతల్లి. జన్మనిచ్చిన తల్లి ఇంత కఠినంగా ప్రవర్తించడం చుట్టు పక్కల వాళ్లు చూస్తున్నప్పటికి కొడుకుని వదల్లేదు. కరెంట్ స్తంభానికి కట్టేసిన కొడుకు వద్దు అని అరుస్తున్నా వినకుండా కళ్లలో కారం (Pepper) చల్లింది. ఈ వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియా(Social media)తో పాటు వాట్సాప్ గ్రూప్‌ల్లో తెగ వైరల్ అవుతోంది. ఎన్ని సార్లు తన కుమారుడికి చెప్పిన వినకుండా రోజు ఇలా గంజాయి పీల్చడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఆ తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది.