డ్రగ్స్ కేసులో హీరోయిన్లను కేటీఆర్ కాపాడారు: రాజాసింగ్
హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లోని (Radission Blue Pub) పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అందులో పబ్ నిర్వహిస్తున్న అభిషేక్ బీజేపీకి చెందిన నాయకుడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టి, బండి సంజయ్ (Bandi Sanjay) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్‌కు అవగాహన లేదని, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. గతంలో పెద్దఎత్తున సినీ నటులను (Film Actors) డ్రగ్స్ కేసులో విచారించారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. అందులో హీరోయిన్ల పేరు రాకుండా మంత్రి కేటీఆర్ (Minister KTR) వారిని కాపాడారనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గోవా తర్వాత డ్రగ్స్‌కు అడ్డాగా హైదరాబాద్ మారిందని విమర్శించారు. అందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కారణమన్నారు.