మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఎగరిన నల్లజెండా…

కరీంనగర్లో నిరసన కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్

0 49,263

తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వరిధాన్యం కేంద్రం సేకరించాలని, మేం సూచించిన విదంగానే పంట పండించాలనే కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా రైతు ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్లోని తన నివాసంలో నల్ల జెండా ఎగరేసిన అనంతరం మిడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతీ రైతు ఇంటిమీద నల్లజెండా ఎగరేసామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి విరమించుకొని బేషరతుగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొంటామనే వరకూ నల్లజెండా ఎగురుతూనే ఉంటుందని స్సష్టం చేసారు మంత్రి గంగుల.

నియోజకవర్గంలో దాదాపు 35,000 గృహాలపై రైతులతో పాటు వారికి మద్దతుగా నగరంలోనూ ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేసారన్నారు. ఇందులో కేవలం టీఆర్ఎస్ పార్టీ రైతులు మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు రైతులుగా కేంద్రానికి వ్యతిరేఖంగా నల్లజెండాలు ఎగరేసారని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు దీన్ని గమనించాలన్నారు, తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ రైతులపై బీజేపీకి కోపమున్నా కనీసం తమ బీజేపీ పార్టీకి చెందిన రైతులు ఎగరేసిన నల్లజెండాల్ని గమనంలోకి తీసుకొని వాళ్లకోసమైనా కేంద్రాన్ని యాసంగిలో ధాన్యం కొనాలని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా కేంద్రం వైపు ఉండడం మానుకొని ఓటేసి గెలిపించిన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాలని హితవుపలికారు.
ఓవైపు తెలంగాణ ప్రజలు భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళనతో ఉన్నారని, పోరాటాల బాట పట్టి అగ్గి రాజుకుంటుందని, సీఎం కేసీఆర్ గారు రైతుబందు, బీమా, 24గంటల ఉచిత కరెంటు, నీళ్లిచ్చారు, వీటివల్ల ఇప్పుడిప్పుడే కోలుకొని కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పిడుగులాంటి నిర్ణయం తీసుకుందనే ఆందోళనలో ఉన్నారన్నారు. దీంతో రైతాంగం భవిష్యత్తు అందకారంలోకి నెట్టేయబడుతుందని కాబట్టే ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతుల పక్షాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తుందన్నారు.
ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లుతెరిచి యాసంగి పంటను కొనాలని సూచించారు మంత్రి గంగుల లేని పక్షంలో ఈనెల 11న సీఎం కేసీఆర్ గారి నేత్రుత్వంలో డిల్లీలో దర్నా తీవ్రంగా ఉంటుందన్నారు, ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్ అని, నేడు కేసీఆర్ గారి సారథ్యంలో సుశిక్షుతులైన సైనికుల్లా పెద్ద బలం, బలగాన్ని ఉన్న టీఆర్ఎస్ కేంద్రం మెడలు వంచడం తథ్యమన్నారు, పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమం కన్నా తీవ్రంగా తెలంగాణ రైతాంగం పోరాటం ఉంటుందన్నారు.
తెలంగాణ రైతుల పొట్టమీద కేంద్రం కొడుతుందని, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. 1965 జనవరి 14న ఏర్పడ్డ ఎఫ్.సి.ఐ నాటి నుండి జరుపుతున్న కొనుగోళ్లలో లేని ఇబ్బందులు నేడు ఎందుకు స్రుష్టిస్తున్నారని ప్రశ్నించారు మంత్రి గంగుల. నాటి నుండి యాసంగిలో బాయిల్డ్, వానాకాలంలో రా రైస్ ఎలా కొనుగోల్లు చేస్తున్నారో అలాగే చేయాలన్నారు, మన తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు భారత దేశం కన్నా విభిన్నంగా ఉంటాయని అందువల్ల యాసంగిలో నూక శాతం పెరిగి పోవడంతో రా రైస్ ఇచ్చే పరిస్థితులు లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకోని బేషరతుగా యాసంగి ధాన్యంతో పాటు ఏ పంట పండించినా కొనుగోలు చేయాలన్నారు. మేం బిక్ష అడగట్లేదని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని 7వ షెడ్యూల్ 246 ఆర్టికల్ ప్రకారం పంటల సేకరణ అధికారం, బాధ్యత ఉన్న కేంద్రం సక్రమంగా నిర్వహించాలని అడుగుతున్నామన్నారు. బేషరతుగా రైతులు పండించిన పంటను యదాతథంగా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents