వడ్లు కొనలేక టిఆర్ఎస్ రాజకీయ డ్రామాల కోసం రోడ్డెక్కింది ..!?

0 1,270

* పంటల పై ఆంక్షలు విధించిన చరిత్ర టిఆర్ఎస్ దే..

* బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని చెప్పింది వాస్తవం కాదా ..?

* దేశంలో ఎక్కడా లేని కొనుగోలు పంచాయితీ తెలంగాణలో ఎందుకుంటుంది..

* సాగునీటి ప్రాజెక్టులకు లక్ష కోట్లుఖర్చుపెట్టింది …పంట కొనక పోవడానికా…

* కేంద్రం నెపం తో రాజకీయ లబ్ది కోసం ఆరాటం..

ఉమ్మడి జిల్లా రైతు సదస్సులో బిజెపి నేత , మాజీ మంత్రి చంద్రశేఖర్ ఘాటైన వ్యాఖ్యలు ..

* వడ్ల కొనుగోలు పై కెసిఆర్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ

తెలంగాణలో రైతుల వడ్లను కొన లేక టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేయడానికి రోడ్డెక్కింద ని, మక్కా జొన్న పంట వేయవద్దు , సన్న వడ్లు వేయాలి, వరి వేస్తే ఊరి అని పంటలపై ఆంక్షలు పెట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని, రాష్ట్రం నుండి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకొని, కొనుగోళ్ల పంచాయతీ పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తోందని, దేశంలో ఎక్కడా లేని కొనుగోళ్ల సమస్య తెలంగాణ లో ఎందు కుంటుందని , రైతులను తప్పుదారి పట్టించడానికి రాజకీయ వేషాలు వేస్తుందని, ఇట్టి అంశంలో కేంద్రం నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మూర్ఖత్వమని బీజేపీ నేత , మాజీ మంత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు సదస్సు” లో భాగంగా శుక్రవారం కరీంనగర్లోని శివ రమేష్ గార్డెన్లో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సులో మాజీ మంత్రి చంద్రశేఖర్, పాల్గొని ప్రసంగించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయడ్రామా కంపెనీగా మారిందని, తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజల ,ఉద్యోగుల , రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి సాగునీటి ప్రాజెక్టులు కట్టింది రైతుల పంటల కోసమైతే, పంట కొనుగోళ్లు ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు రైతు ప్రతీ గింజ తామే కోంటున్నామని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ సర్కార్ మాట మార్చిందని, పంట కొనుగోళ్లలో అనవసర రాద్దాంతం చేస్తూ , టిఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం రైతాంగాన్ని ఆగం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రాల వ్యవసాయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, ఆయా రాష్ట్రాల వ్యవసాయ పాలసీ ప్రకారం నడుచుకుంటాయని, తెలంగాణలో వ్యవసాయ పాలసీ ఉందా..? పంటల ఆంక్షల పేరుతో తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పాలసీ ఉంది తప్ప, రైతాంగానికి ప్రయోజనం చేకూరే పద్ధతి లేదన్నారు . కేవలం రైతాంగానికి రైతు బంధు ఒక్కటే సర్వ రోగ నివారణి అన్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు .రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ తో కెసిఆర్ కు మతిభ్రమించిందని, ప్రజలకు టిఆర్ఎస్ నమ్మకం పోయింది అని చెప్పిన తరువాతనే కెసిఆర్ కేంద్రం మీద ఎదురుదాడి మొదలుపెట్టారని, హడావుడిగా ఉద్యోగ ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు . వ్యవసాయ రంగాన్ని రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని ,భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే ధరణీ తీసుకువచ్చి పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేశారని ,అనేక భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటిని ప్రభుత్వ భూములు అని చెప్పి అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. భూములు అమ్ముకో గా వచ్చిన డబ్బుతోనే జీతాలు ఇచ్చే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారన్నారు . హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యంగా నేడుయాసంగి పంట నూకలు ఎక్కువ అవుతాయని , క్వింటాల్ వరి ధాన్యంలో 65 కేజీల బియ్యం FCI కి పెడతారని ,100 కేజీ లకు 16 కేజీలు నూకలు అనుమతి ఇస్తారని చెప్పారు .ఎండాకాలం అయితే సుమారు 25 కిలోలు వస్తాయి కావొచ్చు ఇందులో తేడా 9 కేజీలు మాత్రమే అనే విషయం గ్రహించాలన్నారు.


నూకలు కూడా కేజీ 19/- అమ్ము తారని, బియ్యం 29/- అమ్ముతారని, ఆ తేడా ఇస్తే మాకు నష్టం రాదని మిల్లర్లు అంటున్నా కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. యాసంగి బాయిల్డ్ రైస్ కొనుగోళ్లతో నూకలతో తేడా వచ్చినా సొమ్ము వందల కోట్లు దాటదని , రైతుల కోసం ఆ మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం దారుణమన్నారు . మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, కాశిపేట లింగయ్య లు కెసిఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికే కెసిఆర్ వడ్లు కొనలేని పరిస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు . రాష్ట్రంలో బిజెపిఎదుగుదలను కెసిఆర్ ఓర్వలేక పోతున్నారని , అందుకే వడ్ల పంట కొనుగోలు అంశాన్ని తెరమీదికి తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేడు చేతికి వచ్చిన పంటను కొనలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని, వెంటనే ప్రభుత్వం దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు కెసిఆర్ వ్యవహారశైలిని గమనించాలని, రైతాంగం మీద కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గుర్తించాలన్నారు .కెసిఆర్ కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ బాయిల్డ్ రైసు కొనుగోలు మీద పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇన్నేళ్లలో ఇప్పుడైనా బాయిల్డ్ రైస్ మిల్లర్ లతో కెసిఆర్ ఎప్పుడైనా వన్ మీటింగ్ పెట్టారా..? బాయిల్డ్ మిల్లర్లకు ప్రోత్సాహకాలు ఇస్తే బాయిల్డ్ రైస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఆ దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని వారు ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకోవడం దాచుకోవడం టిఆర్ఎస్ నైజం గా మారిందని, ఆ సొమ్ము తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసి రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు.

తెలంగాణ రైతులారా కేసీఆర్ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదని, కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ,నీళ్లు ఉండి కూడా వరి వేయలేని దుస్థితి, పంట కొనుగోలు చేయలేని స్థితిలో టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యం అన్నారు. మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేది, రైతుల మేలు కోరేది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అని, పంట కొనుగోలు చేయని , పంటల పై ఆంక్షలు విధించే రైతాంగ వ్యతిరేకి టిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని గ్రహించాలన్నారు. బాయిల్డ్ రైస్ అంశంలో టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలు, ద్వంద వైఖరి అవలంబిస్తోందని , ఇట్టి పూర్తి అంశంలో రైతాంగంచైతన్యవంతులు కావాలని421, కెసిఆర్ రాజకీయ డ్రామాలు గ్రహించి రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి ,జగిత్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,కొరటాల శివ రామకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి , బత్తుల లక్ష్మీనారాయణ, సిరిసిల్ల జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షులు కోలా కృష్ణ స్వామి, జగిత్యాల కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాడుగుల ప్రవీణ్, కటకం లోకేష్, బొంతల కళ్యాణ్ ,మోతె గంగారెడ్డి, మడ్గురి సమ్మిరెడ్డి,ఊరడి శివారెడ్డి , ఎర్రబెల్లి సంపత్ రావు, చొప్పరి జయశ్రీ, దూలం కళ్యాణ్, పెద్దపల్లి జితేందర్, కచ్చు రవి, బండ రమణారెడ్డి, రావుల కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents