బెంగళూరులో అమానవీయ ఘటన, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన తండ్రి
#BangaloreCrime : బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో ఓ తండ్రి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో కాలుతూ అర్పిత్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి అర్పిత్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్థిక లావాదేవీలే కారణమా?
ఏప్రిల్ 1న ఆర్థిక లావాదేవీల కారణంగా 51 ఏళ్ల తండ్రి తన కుమారుడిపై పెట్రోల్ పోసి కాల్చిచంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అర్పిత్ గురువారం ఉదయం మరణించాడు. పశ్చిమ బెంగళూరులోని చామరాజ్‌పేటలోని వాల్మీకి నగర్‌లో ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తండ్రీ కొడుకులు సురేంద్ర కుమార్(బాబు), అర్పిత్‌లుగా పోలీసులుగుర్తించారు. సురేంద్ర కుమార్ అనే వ్యాపారవేత్త తన కుమారుడు అర్పిత్‌కి ఆర్థిక విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత అర్పిత్ బయటకు వెళ్లిపోయాడు. అయితే సురేంద్ర అతడిని వెంబడించి పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు.
పక్కింటి వ్యక్తి ఫిర్యాదుతో వెలుగులోకి
అర్పిత్ తన తండ్రి నిప్పంటించాడని అరుస్తూ రోడ్డుపై పరుగులుపెట్టాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అతను 60 శాతం కాలిన గాయాలతో విక్టోరియా ఆసుపత్రిలో చేరాడు.
బాబు కన్‌స్ట్రక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేస్తుంటాడని, అర్పిత్ తన తండ్రికి సాయం చేసేవాడని ప్రాథమిక విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా అర్పిత్ నిధుల గురించి సరైన లెక్కలు చెప్పలేదని ఆరోపిస్తూ కొన్ని ఆర్థిక విషయాలపై తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే అర్పిత్ బిల్డింగ్ నుంచి బయటకు రాగానే అర్పిత్‌పై బాబు పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. బాబు పక్కింటిలోని లారీ డ్రైవర్ అంబరీష్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 1న అర్పిత్ బిల్డింగ్ ముందు తన స్నేహితుడితో కబుర్లు చెబుతున్నప్పుడు బాబు నిప్పంటించడం చూశానని చెప్పారు. అర్పిత్ మృతి విషయం తెలియగానే ఫిర్యాదు చేసినట్లు అంబరీష్ పోలీసులకు తెలిపారు. అంబరీష్ ఫిర్యాదు మేరకు చామరాజ్‌పేట పోలీసులు బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
A shocking incident has come to light from Bengaluru where a father set his son on fire. The incident is said to have happened on April 1st.
Surendra, a businessman & resident of #Bengaluru set his son Arpit on fire over financial issues.#Karnataka #Bangalore #DisturbingVisuals pic.twitter.com/c7A178RyoU
— Abu Izzah 🇮🇳 (@AbooIzzah) April 7, 2022