బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మాయం
ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి డబ్బులు మాయం చేసిన సంఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన నరేష్ ఏటీఎం కార్డు గడువు ముగియడంతో వివరాల కోసం గూగుల్ లో చెక్ చేశాడు. అందులో ఓ నంబర్‌కు కాల్ చేయగా వారు తెలుగులో మాట్లాడడంతో ఏటీఎం, ఓటీపీ నంబర్ చెప్పాడు. వెంటనే తన ఖాతా నుంచి రూ. 78, 162 డబ్బులు మాయమయ్యాయి. బాధితుడిఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కిశోర్ శుక్రవారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.