బీజేపీ శ్రేణులు వినూత్న నిరసన
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ముప్పై పడకల ఆస్పత్రి ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ మాట ఇచ్చి మూడు సంవత్సరాల పదకొండు నెలలు గడిచినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో బిజెపి నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏదేదో ఫ్లెక్సీ కట్టే వీధుల్లో ఊరేగించారు. తక్షణమే ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.