మంత్రి ఈశ్వర్ సతీమణి ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం, రాఘవపట్నం గ్రామంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామి దేవాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట వెంట జడ్పీటీసీ గోస్కుల జలందర్, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి, వైస్ ఛైర్మన్ బోయపోతు గంగాధర్, ఉపసర్పంచ్ మారం రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు పడల జలంధర్, రాఘవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, యూత్ మండల ఉపాధ్యక్షుడు సల్లూరి శోభన్ గౌడ్, నాయకులు, హనుమాన్ మాలధారులు, తదితరులు పాల్గొన్నారు.