నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని తెలిపింది.