ఆడవాళ్లు తలలో మల్లెపువ్వులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
అవును.. పైన అడిగిన క్వశ్చన్ కు చాలా మందికి అసలైన రీజన్ తెలియదు. మహిళలు తలలో పువ్వులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అని అడిగితే అందం కోసం అని చాలామంది టక్కున సమాధానం చెబుతుంటారు. కానీ, అసలు రీజన్ చాలామందికి తెలియదు. భారతదేశంలో ఇది సాధారణమే అయినా దీనికో ప్రత్యేకత, సంప్రదాయం ఉంది. మహిళలు తలలో పువ్వులు పెట్టుకోవడం మన భారతదేశంలోనే మొదలైంది. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది.
పూలు అందంగా కనిపించడమే కాకుండా నిగూఢమైన అర్థాన్ని కలగలిపి ఉంటాయి. పూలను అందంతోపాటు అదృష్టానికి, సంతోషానికి, మంచి విషయాలకు గుర్తులుగా చూస్తారు. అంతేకాదు.. మహిళలు తమ జడలో పువ్వులు పెట్టుకుంటే ఆమె ఇల్లు హ్యాపీగా ఉంటదని, ఆ ఇల్లు లక్ష్మీ దేవి నిలయంగా మారి సంపద ఆ ఇంటిని వదిలి వెళ్లదని ప్రగాఢంగా నమ్ముతుంటారు.
అయితే, తలలో పెట్టుకునే ప్రతి పువ్వుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ముఖ్యంగా మల్లె పువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంది. పువ్వులలో మల్లె పువ్వును పూలలో రాణిగా పిలుస్తారు. అంతేకాదు..
దీనిని దేవుని పువ్వు అని కూడా పిలుస్తారు. శ్రేయస్సుకు, అదృష్టానికి గుర్తులుగా మల్లె పువ్వులను చూస్తారు. అందుకే మల్లె పువ్వులు లేకుండా ఎటువంటి పండుగా పూర్తికాదు. అందుకే ఎక్కువమంది ఆడవాళ్లు మల్లెపూలను తమ తలలో పెట్టుకుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందని, మల్లెపూల వాసన వల్ల తల్లి నుండి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువరోజులు ఉత్పత్తి అవుతూనే ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు.