చిరంజీవిపై నోరుజారిన శేఖర్ మాస్టర్.. షాక్ లో మెగా ఫ్యాన్స్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ అద్దిరిపోతుంది. ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ వరుస సినిమాల్లో చిరంజీవి బిజీ అయిపోతున్నాడు. ఖైదీ నంబర్ 150తో సూపర్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. సైరాతో బాక్సాఫీస్ దెగ్గర తన సత్తా ఏంటో చాటాడు. అయితే నంబర్ వన్ తెలుగు హీరోగా కొన్ని ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన మెగాస్టార్.. ఇప్పటి యంగ్ హీరోలకు పోటీగా మళ్ళీ నంబర్ వన్ స్థానాన్ని గురిపెట్టాడు అన్న రేంజిలో దూసుకెళ్తున్నారు. వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివ ఆచార్య మూవీ విడుదలకి సిద్ధంగా ఉండగా.. లూసిఫెర్ రీమేక్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. వీటితో పాటు మెహర్ రమేష్ భోళా శంకర్, డైరెక్టర్ బాబీ మూవీలు పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి. మరో రెండు మూడు సంవత్సరాలు చిరు డేట్స్ బ్లాక్ అయిపోయాయి.
ఈ క్రమంలో చిరంజీవికి సంబందించిన ప్రతి అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అద్దిరిపోయే లీక్ ఇచ్చేశాడు. కావాలని చెప్పాడో.. లేక ఫ్లో లో మాట్లాడాడో కానీ చిరంజీవి బాబీల చిత్ర పేరుని రివీల్ చేసి కొంప ముంచాడు శేఖర్ మాస్టర్. చిరంజీవి బాబీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే పేరు కాస్త పాతగా ఉందని.. ఏదైనా ట్రెండీగా పెడదామని ఆ టైటిల్ ని ఇంకా లాక్ చేయలేదు. అయితే ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ.. చిరు బాబీ మూవీకి అదే టైటిల్ ఫిక్స్ చేశారంటూ.. ఒక ఇంటర్వ్యూ లో అసలు నిజం చెప్పేశాడు శేఖర్ మాస్టర్. ఇప్పటికే వాల్తేరు వీరయ్య పాటని కూడా ప్లాన్ చేసినట్టు చెప్పాడు. దీంతో బాబీ టీమ్ ఒక్కసారిగా నిరుత్సహపడ్డారట. చాలా గ్రాండ్ ఈవెంట్ చేసి.. టైటిల్ అనౌన్స్ చేద్దామనుకున్నారో ఏంటో కానీ.. వేదిక గాని వేదికలో శేఖర్ మాస్టర్ మాత్రం చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసి టీమ్ ఆశలన్నీ గల్లంతు చేశాడు.