ఎంపీ అరవింద్ గౌడ కులస్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మెట్ పల్లి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గీత కార్మిక సహకార సంఘం సభ్యులు సమావేశమై మాట్లాడారు, ఎంపీ అరవింద్ గీత కార్మికుల కులదైవమైన రేణుక ఎల్లమ్మ దేవత పట్ల అగౌరపరి చేలా మాట్లాడటంపై ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా గౌడ కుల సంఘ అధ్యక్షుడు పూదారి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గౌరవ ప్రదమైన పదవి లో ఉండే నాయకులు ఇతరుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదని మరోమారు గౌడన్నల మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం సభ్యులు చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, తెలంగాణ గౌడ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చర్లపల్లి ఆనంద్ గౌడ్, గీత కార్మిక మండల అధ్యక్షులు చెట్ల పల్లి సత్యనా రాయణ గౌడ్, సుద్దాల వెంకటనారాయణ, చిన్నయ్య, నర్సాగౌడ్ , శ్రీనివాస్ గౌడు, మనోజ్ గౌడు, ప్రణయ్ కుమార్ గౌడ్, శంకర్ గౌడ్ , హరీష్ గౌడ్ , గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, సతీష్ గౌడ్ , గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గీత కార్మికులు పాల్గొన్నారు.